బాహుబలి వెబ్ సీరీస్ లో శ్రీయా

-

బాహుబలి సినిమా రెండు పార్టులు కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశ సిని ప్రియులందరిని అలరించింది. తెలుగు సినిమాకు బాహుబలి ఒక బ్రాండ్ గా మారిందని చెప్పొచ్చు. ఆ సినిమా నుండి తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది. ఇన్ని అద్భుతాలకు కారణమైన బాహుబలి సినిమా ఇంకా ప్రేక్షకుల మనసుల్లోనే ఉంది.

అయితే ఈ సినిమా మీద ఉన్న బజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాహుబలి ప్రీక్వల్ ను ప్లాన్ చేశారు. అంటే శివగామి పాత్ర నేపథ్యంలో ఈ బాహుబలి ప్రీక్వల్ నడుస్తున్నదన్నమాట. ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం లాంటివి వెబ్ సీరీస్ లో చూపిస్తారట. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో శివగామిగా మృణాల్ థాకూర్ నటిస్తుండగా ఆ వెబ్ సీరీస్ లో కీలక పాత్ర చేస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ ను దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version