తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది.
ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీర సింహ రెడ్డి లో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది.అయితే, తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల వచ్చిన రూమర్స్ పై స్టార్ హీరోయిన్ శృతిహాసన్ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం నాకు రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి లేదు. నాకు సినిమాల్లో నటించడమే ఇష్టం. నేను చిన్న, పెద్ద చిత్రాలనే తేడా చూడను. అన్ని సినిమాల్లో నటిస్తా…. ప్రేక్షకులను అలరిస్తా. కాకపోతే నేను తమిళ అమ్మాయిని కాబట్టి ఎక్కువగా ఆ సినిమాల్లోనే నటిస్తా’ అని శృతి పేర్కొన్నారు.