ఒక్కో పాటకు సిధ్ శ్రీరామ్ ఎంత వసూల్ చేస్తాడంటే..?

-

ఉండిపోరాడే గుండె నీదేలే అని ప్రేమికులు పాడుకున్నా.. చెప్పుకోలేనే అంటూ విరహవేధనను అనుభవించే వారు పాడుకునే పాటైనా అది సిధ్ శ్రీరామ్ గొంతులోంచి వస్తేనే దానికంటూ ఓ ప్రాణముంటుంది. సిధ్ శ్రీరామ్ గాత్రంలోంచి వచ్చిన పాటలకు జీవం ఉంటుందేమోన్నన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. అంతలా యువతను కట్టిపడేశాడు సిధ్ శ్రీరామ్.

ఇంకేం ఇంకేం కావాలే అంటూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. మాటే వినదుగా అంటూ ప్రేమికులు ఊహల్లో తేలిపోయేలా చేశాడు. సామజవరగమన అంటూ సోషల్ మీడియాను షేక్ చేసేశాడు. ప్రస్తుతం నీలి నీలి ఆకాశం అంటూ హల్చల్ చేస్తున్నాడు. సిధ్ శ్రీరామ్ పాట ఉందంటే.. ఆ సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి.

టాప్ సింగర్స్ రెమ్యూనరేషన్స్ దాదాపు లక్ష రెండు లక్షల మధ్య ఉంటుందని టాక్. అయితే సిధ్ శ్రీరామ్ ఎంత పుచ్చుకుంటాడో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఒక్కో పాటకు సిధ్.. అక్షరాల ఐదు లక్షలు తీసుకుంటాడట. ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది కాబట్టి నిర్మాతలు కూడా లైట్ తీసుకుంటున్నారట. మరి ఈ క్రేజ్ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version