అల్లు అర్జున్ రిలీజ్ అయి ఇంటికి రాగానే… స్నేహరెడ్డి, అర్హల రియాక్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక వీళ్ల స్పందన చూస్తే అందరికీ కన్నీళ్లు రావాల్సిందే. తీవ్ర ఉద్వేగానికి లోనైన అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలు నుంచి ఇంటికి చేరుకొన్న అల్లు అర్జున్ ను చూడగానే స్నేహరెడ్డి ఎమోషనల్ అయ్యారు.
కన్నీటి పర్యంతమై బన్నీని ఆలింగనం చేసుకున్నారు స్నేహరెడ్డి. అల్లు అర్జున్ రాక కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ తరుణంలోనే… మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. రేవతి కుటుంబానికి మరోసారి తన సంతాపం తెలిపారు అల్లు అర్జున్. అది అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు.
నాన్న.. అల్లు అర్జున్ కోసం అర్హ..
అల్లు అర్జున్ రాక కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు#AlluArjun pic.twitter.com/TSG3fyLUO4
— Pulse News (@PulseNewsTelugu) December 14, 2024