విశ్వక్ సేన్ ను మించిన కుర్ర హీరో ప్రాంక్.. లొల్లి లొల్లి..

-

సిని ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలోకి చాలామంది సక్సెస్ అవ్వాలని ఎన్నోకలలతో అడుగు పెడుతూ ఉంటారు. ఇక మొదటి సినిమాతో కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటే .. మరికొంత మంది ప్రజలతో మమేకమై ఫ్రాంక్ వీడియోలు అంటూ తమ సినిమాను పాపులారిటీ చేసుకోవడం ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది మాత్రం యంగ్ హీరో విశ్వక్ సేన్ అని చెప్పవచ్చు. విశ్వక్ తన సినిమాలను పాపులారిటీ చేసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా తానే స్వయంగా ప్రజలతో మమేకమై ఫ్రాంక్ వీడియోలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా వివాదాలతో బాగా పాపులారిటీ నీ సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరహాలోనే ఇక కొత్త హీరోలు కూడా ఇలా ప్రజలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలోని సినీ ఇండస్ట్రీకి మరో కొత్త హీరో టాలెంటెడ్ హీరో , తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను మేప్పించాలని సాఫ్ట్ వేర్ బ్లూస్ అనే తన మూడవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఇక ఈ హీరో పేరు శ్రీరామ్ నిమ్మల.. ఉమా శంకర్ దర్శకత్వంలో భావన హీరోయిన్ గా , శ్రీ రామ్ నిమ్మల హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాఫ్ట్ వేర్ బ్లూస్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలవ్వగా మిలియన్ న్యూస్ ను సొంతం చేసుకుంది . జూన్ 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ చేపట్టారు.

ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ ఫ్రాంక్ వీడియో చేసి పెద్ద గొడవ చేసారని చెప్పవచ్చు. ప్రమోషన్స్లో భాగంగా ఫ్రాంక్ వీడియో అంటూ.. వీడియో షూట్ చేస్తూ ఉండగా సదరు వ్యక్తి వచ్చి .. వీడియో లు తీయొద్దంటూ గొడవ పడ్డాడు. అంతేకాదు చొక్కా చించుకునే అంతగా గొడవ పడడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ వీడియో శ్రీరామ్ నిమ్మలకి ప్లస్ పాయింట్ అవుతుందా.. అంటే 24న సినిమా విడుదల అయితే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version