ప్రముఖ సినీ నటి సోనమ్ తన జుట్టును 12 అంగుళాలు కత్తిరించి అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే… నటి సోనమ్ కపూర్ వరుస సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది తన జుట్టును 12 అంగుళాలు కత్తిరించి చారిటీకి దానం చేసింది. ఆమె చేసిన ఈ పనికి సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా సోనమ్ కపూర్ హెయిర్ కట్ వీడియోను తన అభిమానులతో షేర్ చేసుకుంది.

అభిమానులు ఆమె కొత్త లుక్ చూసి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. 40 ఏళ్ల సోనమ్ కపూర్ తీసుకున్న ఈ నిర్ణయానికి తన అభిమానులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇంత గొప్ప పనిని ఎవరూ చేయలేరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీ జుట్టును ఇలా చారిటీకి దానం చేయడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.