Rinku Singh: ఎంపీతో రింకూ సింగ్ పెళ్లికి బ్రేకులు !

-

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన పెళ్లి మరి కొన్ని రోజులు వాయిదా పడే ఛాన్సులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్… తో రింకు సింగ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి వివాహం మరికొన్ని రోజులపాటు వాయిదా పడే ఛాన్స్ ను ఉన్నట్లు తెలుస్తోంది.

Rinku Singh gets engaged to SP's Priya Saroj in private ceremony
Rinku Singh gets engaged to SP’s Priya Saroj 

రింకు సింగ్… బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి వాయిదా పడే ప్రమాదం పొంచి ఉందట. ఈ ఏడాది నవంబర్ 19వ తేదీన వీరిద్దరి పెళ్లి కావాల్సి ఉంది. కానీ నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు టీమిండియా… సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు అలాగే ఐదు t20 లు ఆడనుంది టీమిండియా. దీంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కి రింకు సింగ్ పెళ్లి వాయిదా పడే ఛాన్సులు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news