త్వరలో తెలుగు ఆడియన్స్ కి నా కొడుకుని పరిచయం చేస్తా – కాజల్

-

ప్రముఖ బ్యూటీ చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది హీరోలతో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న కాజల్ అగర్వాల్ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అందరిని మరింతగా ఆకట్టుకుంది. ఇక చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో మరింత స్టార్డం సొంతం చేసుకుంది. ఇకపోతే వరుసగా స్టార్ హీరోలతో సరైన అవకాశాలు దక్కించుకొని సీనియర్ హీరోలతో కూడా కలిసి నటించి.. మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

సీనియర్ హీరోలతో నటిస్తూ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లి తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రీయంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మరింతగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన చిత్రం సత్యభామ. లేడీ ఓరియంటెడ్ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ లుక్కును కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ మాకు ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాము.

సత్యభామగా ఈసారి మీ ముందుకు రాబోతున్నాను.. ఇప్పటివరకు మీరు చూడని పాత్ర ఇది.. కానీ తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా కొడుకు నీల్ ను తీసుకు వెళుతూ ఉంటాను. కానీ ఈసారి నేను నా బిడ్డను తీసుకురాలేదు. కానీ సత్యభామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తప్పకుండా నా కొడుకుని హైదరాబాద్ కి తీసుకువచ్చి తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేస్తాను అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version