మూడో పెళ్లికి సిద్ధమవుతున్న శ్రీజ.. పోస్ట్ వైరల్..!

-

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినీ ఇండస్ట్రీలోకి రాకపోయినా తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గతంలో బ్రాహ్మణ వ్యక్తిని కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ వివాహం చేసుకొని.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చి తండ్రి దగ్గరకు చేరుకుంది. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత చిరంజీవి ఆల్రెడీ పెళ్లయిన కళ్యాణ్ దేవ్ తో ఆమె వివాహం జరిపించారు.

ఈ బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగ లేక పోయింది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ షేర్ చేసిన ఈ పోస్టు మరింత అనుమానాలకు దారి తీస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా గత ఏడాది జరిగిన మూమెంట్స్ ని షేర్ చేస్తూ..” డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసావు.. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి.. నన్ను అమితంగా ప్రేమిస్తూ.. కేరింగ్ గా చూసుకుంటూ కష్టసుఖాలలో నాకు తోడుండే వ్యక్తి.. ఎప్పుడు నాకు సపోర్టుగా నిలబడే వ్యక్తి..ఇతడిని కలుసుకోవడం అద్భుతం.. ఇక కొత్త ప్రయాణం మొదలవుతుంది..” అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో ” కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నా” అంటూ శ్రీజ వెల్లడించడంతో అటు అభిమానులతో పాటు నెటిజనులలో కూడా ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యకాలంలో శ్రీజ కళ్యాణ్ దేవ్ లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్గా కూతురు బర్తడేను కూడా శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్ట్ చేయడంతో నిజంగానే ఈమె మళ్లీ పెళ్లికి సిద్ధం అయ్యిందా అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version