ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు.. రాజ్యాంగ హింసగా పరిగణించబడవని సుప్రీంకోర్టు ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని.. 4:1 తేడాతో తీర్పును ప్రకటించింది రాజ్యాంగ ధర్మాసనం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి ఆంక్షలు మినహా వాక్ స్వాతంత్య్రం పై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని.. పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ హింసగా పరిగణించబడదని తెలిపింది.
ప్రభుత్వాన్ని రక్షించడం కోసం మంత్రి చేసిన ప్రకటన సమిష్టి బాధ్యతగా చూడాలి, దీనిని ప్రతికూలంగా ఆపాదించలేమని… పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగపరమైన హింసగా పరిగణించబడదు, కానీ అది ఒక ప్రభుత్వ అధికారిని తప్పించడం లేదా నేరం చేయడానికి దారితీస్తే అది రాజ్యాంగ హింస అని తెలిపింది సుప్రీం కోర్టు.