టాలీవుడ్లో మొన్నటిదాక దుమ్ములేపిన మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో తన జోరు చూపిస్తోంది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్గా ఈ భామ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఆమెపై మనసు పారేసుకుంటున్నారు. రెడ్ అండ్ ఎల్లో లంగా వోణీలో ఈ భామ అందం మామూలుగా లేదు. అచ్చ తెలుగు ఆడపిల్లలా శ్రీలీల ఈ ఔట్ఫిట్లో భలే బ్యూటీఫుల్గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈమె అందం మామూలు అందం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఎంతందంగా ఉన్నావే శ్రీ అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ కామెంట్ బాక్సులన్నీ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీస్తో నింపేస్తున్నారు.
ఇక శ్రీలీల సినిమాల సంగతికి వస్తే ఇటీవలే ఆదికేశవ, గుంటూరు కారం వంటి సినిమాలతో సందడి చేసింది. మొదట్లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ వరుస సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు వరుస ప్లాఫ్లతో సతమతమవుతోంది. అయినా ఈ భామకు ఆఫర్లకు మాత్రం ఏం కొదువ ఉండటం లేదు.