బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెర.. మరోవైపు వెండితెరపై కనిపిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తన మెయిన్ ఫోకస్ అంతా టీవీపైనే పెట్టిన శ్రీముఖి.. ఏ ఛానెల్ పెట్టినా తానే కనిపించే అంతలా బిజీ అయిపోయింది. యాంకర్‌గా పీక్ స్టేజ్‌లో ఉంది. ఈవెంట్లు.. రియాల్టీ షోలకు హోస్టుగా వ్యవహరిస్తోంది.
ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఫొటోషూట్స్కైతే లెక్కే లేదు. ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్‌కు చాలా మంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. తాజాగా శ్రీముఖి ట్రెడిషనల్ వేర్లో ఆకట్టుకుంది. కృష్ణాష్టమి సందర్భంగా ట్రెడిషనల్ వేర్లో కనిపించి ఫిదా చేసింది. చోళీ లెహంగా ధరించి నిండుగా కనిపించింది.
ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అయిపోయిందనే చెప్పాలి. చందమామ అమ్మాయిగా మారితే బహుశ శ్రీముఖిలా ఉంటుందేమోనని సోషల్ మీడియా యూజర్స్ అభివర్ణిస్తున్నారు. ఎంత ముద్దొస్తున్నావో శ్రీ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.