టాలీవుడ్‌పై కోలీవుడ్ ఉమ్మేస్తోంది – శ్రీ‌రెడ్డి

-

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గత శుక్రవారం మృతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడిన ఆయ‌న తుదిశ్వాస‌ విడిచారు. శనివారం చెన్నై శివారులోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో బాలు అంత్ర‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కోలీవుడ్ నుంచి కొంత మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, స్టార్ హీరో విజ‌య్‌, భాగ్య‌రాజా, దేవిశ్రీ‌ప్ర‌సాద్‌తో పాటు కొంత మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు.

అయితే బాలు అంత్య‌క్రియ‌ల్లో అత్యంత ఆప్తుడైన అజిత్ పాల్గొన‌లేద‌ని వివాదం న‌డిపించింది. దీంతో బాలు త‌న‌యుడు ఎస్పీ చ‌ర‌ణ్ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే టాలీవుడ్‌కు చెందిన వారెవ‌రూ బాలు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌పై ఫైర్ బ్రాండ్ శ్రీ‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఆమె ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా చిరంజీవి ఎందుకు పాల్గొన‌లేద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ద‌శాబ్దాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించిన బాలుని టాలీవుడ్ విస్మ‌రించింద‌ని, బాలు మ‌ర‌ణం త‌రువాత అన్న‌య్య అప్పుడే వెళ్లిపోయావా అంటూ కొంత మంది ముస‌లి క‌న్నీళ్లు కార్చార‌ని మండిప‌డింది. చిరంజీవికి గుండు గెట‌ప్‌పై వున్న ఆస‌క్తి బాలు అంత్య‌క్రియ‌ల‌పై లేద‌ని, బాలు అంత్య‌క్రియ‌ల‌కు టాలీవుడ్ నుంచి ఒక్క‌రు కూడా హాజ‌రు కాక‌పోవ‌డంతో టాలీవుడ్‌పై కోలీవుడ్ ఉమ్మేస్తోందిని శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version