డ్రీమ్ 11 యాప్ ని నిషేధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

-

ఈ ఏడాది డ్రీమ్ 11, ఐపీఎల్ స్పాన్సర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఫాంటసీ క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్ బాల్, కబడ్డీ మొదలగు ఆటలు కూడా ఆడవచ్చు. ఐతే ఈ యాప్ పై దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిషేధం విధించారు. తెలంగాణలో గత కొన్నేళ్ళుగా ఈ యాప్ పై నిషేధం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రీమ్ 11 యాప్ ని నిషేధించింది. ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకుందట.

దాంతో డ్రీమ్ 11 యాప్ పై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో చాలామందికి ఇది షాకింగ్ గా మారింది. అప్పటి వరకూ డ్రీమ్ 11 లో దాచుకున్న డబ్బులు ఎలా అనే సమస్య మొదలైంది. సడెన్ గా ఈ నిషేధం రావడంతో వ్యాలెట్ లో డబ్బులు ఉంచుకున్న వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది. అదీగాక ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో అందరూ ఫాంటసీ క్రికెట్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నిషేధం విధించడంతో యాప్ ఓపెన్ కావడం లేదు. మరి ఈ టైమ్ లో డ్రీమ్ 11 వాడేవారు ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version