పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మై డియర్ మార్కండేయ అనే పాటను విడుదల చేయడం జరిగింది. ఇకపోతే జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా తాను ఒకవైపు గుంటూరు కారం సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు బ్రో చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం ఎలా అనిపిస్తోంది అనే విషయంపై కూడా స్పందించారు. అంతేకాదు సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ పై కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ట్రోల్స్ నేను చూస్తూనే ఉంటాను. అందులో మంచివి మాత్రమే తీసుకుంటాను. చెడుని పక్కన పెట్టేసాను.. ప్రశంసలు తీసుకున్నప్పుడు విమర్శలు కూడా తీసుకోగలగాలి..
కానీ నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో సంగీతం కోసం మా దర్శక నిర్మాతలకు మాత్రమే తెలుసు.. కొందరేదో కావాలని విమర్శలు చేస్తే వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇకపోతే నేను ఈ స్థాయికి రావడానికి 25 సంవత్సరాల సమయం పట్టింది.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం ఇక్కడికి వచ్చాను.. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం నేర్చుకున్నాను.. ఇక ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా వెనుకాడేది లేదు అంటూ ఆయన కామెంట్లు చేశారు.