ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ రాజును ఫైనల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి పార్టీలను సంప్రదించిన తర్వాత… ఈ నిర్ణయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీంతో రేపు రఘురామకృష్ణ రాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేయనున్నారు.
ఇంకా ఎవరైనా నామినేషన్ వేయకుండా ఉంటే ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికవుతారు రఘురామకృష్ణరాజు. వాస్తవంగా ఏపీ కేబినెట్లో ఆయనకు పదవి వస్తుందని అందరు అనుకున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ గా చంద్రబాబు చాన్స్ ఇవ్వడం జరిగింది.