ఏపీ IPL టీం పేరుపై నారా లోకేశ్ సెటైర్లు వేశాడు. AP కి ఐపీఎల్ టీమ్ ఉండాలన్న సీఎం జగన్ వాక్యాలపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ‘ఏపీకి ఐపీఎల్ టీమ్ వస్తే దాని పేరు ఏంటో సోషల్ మీడియాలో ట్రోల్స్ పెట్టారు. నాలుగు ఆప్షన్స్ పెట్టారు. అవి… 1. త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జెసిబి నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ చాలెంజర్స్’ అని ఎద్దేవా చేశారు లోకేష్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారని ఫైర్ అయ్యారు నారా లోకేష్.
డ్రెయిన్లను కూడా వదలని వైకాపా బకాసురులు!
రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్… pic.twitter.com/9J4xNkCAgD— Lokesh Nara (@naralokesh) July 10, 2023