నాగార్జున కొత్త టాటూ వెన‌క స్టోరీ తెలుసా..!

-

బిగ్ బాస్ రియాలిటీ షోలో కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి నాగార్జున ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాష‌న్ ఐకాన్‌గా నిలుస్తుంటారు. అయితే 60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యువకుడుగా కనిపించడం నాగార్జునకే దక్కుతుంది. ఇటీవ‌ల‌ 60వ పుట్టినరోజు స్పెయిన్ లో ఇబీజాలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుత రోజుల్లో టాటూలను వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది.

Story Behind Nagarjuna’s New Tattoo

అక్క‌డా ఇక్క‌డా తేడాలేకుండా టాటూలు వేయించుకుంటారు. ఈ క్ర‌మంలోనే టూర్ లో నాగార్జున ఎడమచేతిమీద ఒక టాటూ వేసుకున్నాడు. ఇదిలా ఉండ‌గా బిగ్‌బాస్ 50వ ఎపిసోడ్ సంద‌ర్భంగా స్పెషల్ గెస్ట్ నానీని మంచి ఊపున్న పాటతో నాగార్జున ఆహ్వానించారు. బిగ్‌బాస్‌ షోలోకి గెస్ట్‌గా వచ్చిన నాని టాటూ వెనుక ఉన్న కథ ఏంటో చెప్పమని అడిగాడు. దీంతో నాగార్జున్ పెద్ద క‌థే చెప్పారు. నాగుపాము తన కుబుసాన్ని విడిచిపెట్టింది.అలానే తాను కూడా గతంలో జ‌రిగిన విష‌యాల‌ను పక్కన పెట్టారు.

నాగుపాము పైన ఉన్న కన్ను తనదే అని, జీవితంలో కొత్త విషయాలను వెతుకుతూ ఉంటానన్న గుర్తుకు సంకేతంగా కన్ను బొమ్మ వేయించినట్టు చెప్పారు. ఇక దిక్సూచి పైన ఎన్ అక్షరం ఉత్తర దిశా, నాగార్జున అనే రెండింటిని సంకేతం అని చెప్పారు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీని అర్ధం అని నాగార్జున వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version