కారు డ్రైవ్ చేసింది నేను కాదు.. ఇప్పటికి షాక్ లోనే ఉన్నా.. సుధాకర్..!

-

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైన సుధాకర్ కుమ్మాకుల శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద కారు యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ ప్రమాదం తన డ్రైవర్ తప్పిదం వల్ల జరిగిందని. తాను సీట్ బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి బ్రతికానని ఇప్పటికి తలకు గాయమైంది, చేతి వేలు కట్ అయ్యిందని అన్నాడు సుధాకర్.

ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు.. డ్రైవర్ గట్టిగా అరిచే దాకా అసలేమైందో తెలియలేదు. వెంటనే గాయాలతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లాం. అయితే ఈ ఘటనలో లక్ష్మి గారు చనిపోవడం చాలా బాధకరం. హాస్పిటల్ దగ్గరకు దాదాపు 200 మంది వచ్చారు. పోలీసులు తమకు సెక్యురిటీ కల్గించారని అన్నారు సుధాకర్. ఇక తను డ్రైవ్ చేస్తున్నట్టుగా నిన్న కొన్ని వబ్ సైట్లు వార్తల్లో రాశారు. అలాంటివి రాయడం వల్ల తమ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. ఆ వార్తలు చదివి నా భార్య యూఎస్ లో షాక్ కు గురైందని చెప్పాడు సుధాకర్. ఇప్పటికి ఆ షాక్ లోనే ఉన్నా అంటూ యాక్సిడెంట్ కు సంబందించిన వివరాలు ప్రెస్ కు చెప్పారు సుధాకర్ కుమ్మాకుల.

Read more RELATED
Recommended to you

Exit mobile version