బుల్లితెర యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారుండరు. తన యాంకరింగ్, స్పాంటెనిటీ, కామెడీ టైమింగుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా సుధీర్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన హిందూ దేవుళ్లను అవమానించే విధంగా ఉన్నాయంటూ నెట్టింట తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
తాజాగా ఓ షోలో పాల్గొన్న సుడిగాలి సుధీర్ స్టేజిపైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చి.. నందీశ్వరుడి తలపై భాగం నుంచి శివుడిని చూసినట్లుగా.. సుధీర్.. నటి రంభను చూశాడు. వెనకాలే ఉన్న రవి.. ఏంటి బావ స్వామివారు దర్శనం అయ్యారా అనగా.. నాకేంటి అమ్మోరు దర్శనం అవుతోంది అంటూ రంభను ఉద్దేశించి సుధీర్ అంటాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సుధీర్ హిందూ దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించాడని ఫైర్ అయ్యారు. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ అతడిని వెనకేసుకొస్తున్నారు.