సుమంత్ సుబ్రహ్మణ్యపురం టీజర్.. సస్పెన్స్ థ్రిల్లర్

-

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ లాస్ట్ ఇయర్ మళ్లీ రావాతో కెరియర్ లో నూతన ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. కెరియర్ ప్రారంభించి దశాబ్ధ కాలంపైగా అవుతున్నా ఇన్నాళ్లకు సుమంత్ కరెక్ట్ ట్రాక్ ఎంచుకున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం సుమంత్ చేస్తున్న సినిమాలు ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం. రెండు మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలే అనిపిస్తున్నాయి.

ఇదం జగత్ టీజర్ ఈమధ్యనే వచ్చి ఇంప్రెస్ చేయగా దసరా కానుకగా సుమంత్ చేస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ చూస్తే గుడి చూట్టూ జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందని చెప్పొచ్చు. టీజర్ పర్ఫెక్ట్ గా కట్ చేయగా సినిమా మీద ఆసక్తి మరింత పెరిగేలా చేశారు.

కచ్చితంగా సుమంత్ కు రాబోతున్న ఈ రెండు సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని ఆశించవచ్చు. ఇక ఈ సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా రివీల్ చేయలేదు. మరి సుమంత్ క్రేజీ అటెంప్టులుగా చేసిన ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version