పోకిరి లేకుంటే మహేష్ ఎక్కడుండేవాడు.. పూరిని మర్చిపోతాడా..!

-

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు అతనో సూపర్ స్టార్ గా ఎదగడం అంటే మాములు విషయం కాదు. సూపర్ స్టార్ మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి రాజకుమారుడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఆ సినిమా మహర్షి వరకు 25 సినిమాలు చేశాడు మహేష్. మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్ లో గల పీపుల్స్ ప్లాజాలో జరిగింది.

విక్టరీ వెకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా వచ్చిన ఈ వేడుకలో మహేష్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. తన 25 సినిమాల్లో తని ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుల పేర్లను ప్రస్థావించాడు మహేష్. అయితే అందులో భాగంగా మహేష్ కెరియర్ లో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను.. ఆ సినిమా డైరక్టర్ పూరి జగన్నాథ్ ను మర్చిపోయాడు మహేష్. పోకిరి ముందు వరకు మహేష్ ఒక స్టార్ మాత్రమే కాని పోకిరి తర్వాతే అతను సూపర్ స్టార్ అయ్యాడు. అయితే ఈవెంట్ లో పోకిరి సినిమాను.. పూరిని మర్చిపోయిన మహేష్.

ఈవెంట్ తర్వాత తన ట్విట్టర్ లో మిస్సెడ్ పోకిరి సినిమా.. తనని సూపర్ స్టార్ ను చేసిన సినిమా పోకిరి. ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కు థ్యాంక్స్. తను ఎప్పుడు మర్చిపోని సినిమా పోకిరి అంటూ ట్వీట్ చేశాడు. చెప్పాల్సిన చోట మర్చిపోయి ఇప్పుడు ట్వీట్ చేసి ఏం లాభమని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే వేడుకలో తన కోసం వంశీ పైడిపల్లి రెండేళ్లు వెయిట్ చేశాడని.

10 నిమిషాలు కథ చెప్పి పంపించేద్దామని అనుకోగా కథ నచ్చి రెండేళ్లు ఆగాలనగా అయినా సరే వెయిట్ చేశడని.. కాని అందరు ఇలా ఉండరని అన్నాడు మహేష్. మహేష్ ఈ కామెంట్ చేసింది సుకుమార్ ను ఉద్దేశించే అని అనుకుంటున్నారు. మొత్తానికి మహేష్ మహర్షి ఈవెంట్ పూరి, సుకుమార్ లకు డిజపాయింట్ చేసిందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version