టాలీవుడ్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫీవ‌ర్‌..

-

తెలుగు హీరోల‌కి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. యంగ్‌స్ట‌ర్స్ నుంచి స్టార్స్, సూప‌ర్‌స్టార్స్ వ‌ర‌కు అందరు విజ‌య్ నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. విజ‌య్ హీరోగా చేసింది ఏడు సినిమాలు. అందులో మంచి విజ‌యాల‌ని సాధించిన‌వి మూడే. పెళ్ళిచూపులుతో హీరోగా అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌రెడ్డితో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఇక గీత గోవిందంతో డే అండ్ నైట్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అత‌నికి వ‌చ్చిన క్రేజ్‌కి మెగాస్టార్ చిరంజీవినే దిగిరావాల్సి వ‌చ్చింది. ఈ సినిమాల‌తో విజ‌య్‌కి మాస్‌, క్లాస్ ఆడియెన్స్ లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు విజ‌య్ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇత‌ర స్టార్స్, సూప‌ర్ స్టార్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

Vijay Devarakonda at MAHARSHI Pre Release Event

తాజాగా మ‌హేష్ బాబు త‌న మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి విజ‌య్‌ని ఆహ్వానించ‌డంలోనే ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు త‌ను కూడా యంగ్ హీరోల్లో ఎక్కువ‌గా అడ్మైర్ చేసిదే విజ‌య్‌నే అని మ‌హేష్ చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య్ అవ‌స‌రం ఇప్పుడు మ‌హేష్‌కి ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అదే టైమ్‌లో విజ‌య్ ఫ్యూచ‌ర్ అని ప‌రోక్షంగా హింట్ ఇచ్చారు. గ‌తంలో ఎన్జీఆర్‌, బ‌న్నీ సైతం విజ‌య్‌ని ప్ర‌శంసల‌తో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఇలా ఓ ర‌కంగా ఇప్పుడు టాలీవుడ్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫీవ‌ర్ ప‌ట్టింద‌నే కామెంట్ సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్‌, హీరోతోపాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version