చత్రపతి హిందీ రీమేక్ ట్రైలర్ చూశారా!

-

Chatrapati: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం చత్రపతి. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. చిత్ర బృందం భారీ యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది..

టాలీవుడ్ యంగ్​ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో యంగ్ హీరో ప్రభాస్ శ్రేయ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు రీమేక్ సిద్ధమైంది వివి వినాయక దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ నుస్రత్‌ బరూచా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానుల్ని ఆకట్టుకోగా ప్రస్తుతం ట్రైలర్ విడుదలై అలరిస్తుంది.

సినిమా తెలుగులో భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉండగా తెలుగు వెర్షన్ కి ఏ మాత్రం తగ్గకుండా హిందీ రీమేక్ ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో భారీ యాక్షన్ సీన్లతో పాటు ఫైటింగ్స్ అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్​గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. తెలుగులో ప్రభాస్ ఏ విధంగా ఫిట్గా కనిపించారు అదే విధంగా తన బాడీని బెల్లంకొండ మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ జానీ లివ‌ర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్​ బరూచా, భాగ్యశ్రీతో పాటు అమిత్ నాయర్, సాహిల్ వైద్, శివమ్ పాటిల్, రాజేంద్ర గుప్తా, ఆశిష్ సింగ్ సహా పలువురు నటించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ బ్యానర్​పై బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version