ఇది కంటి తుడుపు చర్య మాత్రమే : బండి సంజయ్‌

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తెలంగాణ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన.. రూ.వెయ్యి వేతనం ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు బండి సంజయ్. పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేనన్న ఆయన… అత్యంత పేదరికంలో ఉన్న వీరికి రూ.వెయ్యి మాత్రమే పెంచడం సరికాదని వెల్లడించారు. ఇది కంటి తుడుపు చర్య మాత్రమేనని అన్నారు ఆయన. ఎన్నికలు వస్తున్నాయనే.. రూ.వెయ్యి పెంపు: సీఎం కేసీఆర్ పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని.. ఉద్యోగ భద్రత ఊసేలేదని సంజయ్ మండిపడ్డారు బండి సంజయ్. ఆరోగ్యాన్ని, వయస్సును పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు పని చేస్తున్నారని వెల్లడించారు. కార్మికులకు అనారోగ్య సమస్య తలెత్తితే పట్టించుకునే యంత్రాంగం లేదని.. ఇలాంటి వారి పట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వాయ్కతపరిచారు బండి సంజయ్.

ఎన్నికలు వస్తున్నాయనే.. రూ.వెయ్యి పెంచి, ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఆరు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే: పారిశుద్ధ్య కార్మికులెవరూ బాధపడొద్దని.. ఆరు నెలలు ఓపిక పడితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ తేల్చి చెప్పేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అదనంగా మరో రూ.2 వేల వేతనం పెంచుతామని వెల్లడించారు. దసరా, ఉగాది పర్వదినాల సమయంలో ప్రత్యేక బోనస్ అందిస్తామని అన్నారు ఆయన. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్‌ పరీక్షలో తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో పరీక్ష పేపర్లు అందజేయడం పై ఆగ్రహం వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version