బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ కు భారీ డిమాండ్ చేస్తున్న తమన్నా..!!

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి శ్రీ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి ఆ తర్వాత హ్యాపీడేస్ చిత్రంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె.. స్టార్ హీరోల తండ్రులతో కూడా జతకట్టి మరింత పాపులారిటీ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా చాలామంది హీరోయిన్లు ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు వారు సాధారణంగా హీరోయిన్ గా ఒక సినిమాకు తీసుకునే పారితోషకం కంటే ఐటమ్ సాంగ్ చేయడానికి ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే నిర్మాతలు కూడా దిగిరాక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఐటమ్ సాంగ్ అనేది ట్రెండీగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటేనే చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు కూడా ఇలా ఒక ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ ను తమ సినిమాలలో రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎన్బికె 108 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. అయితే ఇందులో తమన్నా నటించబోతుందని ఈ పాట కోసం ఆమె ఏకంగా 1.5 కోట్ల మేర డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు కాస్త వెనుకడుగు వేసినట్లు సమాచారం. కానీ అనిల్ రావిపూడి మాత్రం అలనాటి తారలైతేనే ప్రేక్షకులకు మంచి మజా వస్తుంది అని.. కాబట్టి తప్పకుండా ఈ ఐటమ్ సాంగ్ లో తమన్నా నటించాలని భీష్ముంచి కూర్చున్నారట. ఇక చేసేదేమీ లేక నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం . మొత్తానికైతే బాలయ్య సినిమాలో బాలయ్య సరసన ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించడానికి సిద్ధమవుతోంది తమన్నా.

Read more RELATED
Recommended to you

Exit mobile version