ఇన్నాళ్లకు బయటపడ్డ తమన్నా బ్యూటీ సీక్రెట్స్.!

-

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం అవసరం లేదు. తెలుగులో శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత అనతి కాలంలోనే మరిన్ని సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. హ్యాపీడేస్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న ఈమె తర్వాత తెలుగులో రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ , బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇలా వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకొని తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇకపోతే మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె అంత అందంగా ఉండడానికి ఏం చేస్తుంది అనేది చాలామంది ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు. అయితే ఉదయాన్నే ఆమె తన ముఖానికి ఏం రాస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నిజానికి చాలామందికి అనేక రకాల కారణాలతో ముఖం మీద మచ్చలు, మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల సబ్బులు, క్రీములు కూడా వాడుతూ లక్షల కొద్ది డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. కొంతమంది ఫారెన్ నుంచి కాస్మెటిక్స్ తెప్పించుకుంటే .. మరికొంతమంది పల్లె ప్రాంతాలకు వెళ్లి ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారు.

అయితే తమన్నా మాత్రం తన ముఖాన్ని అందంగా ఆకర్షణంగా మార్చుకోవడానికి ఉదయాన్నే తన ఉమ్ముని వాడుతుందట. ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితం తమన్న ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమెను చాలా సేపు స్కిన్ కేర్ రొటీన్ గురించి అడిగితే తాను ఉదయాన్నే లేవగానే మార్నింగ్ సెలైవాను తన ముఖానికి రుద్దుకుంటానని చెప్పుకొచ్చింది. అంటే తన నోటి నుంచి వచ్చే ఉమ్ముని తీసి ముఖం మొత్తం రుద్దుకుంటుందట. కొద్దిసేపు ఎండిన తర్వాత సాఫ్ట్ సోప్ తో కడిగేస్తానని చెప్పుకొచ్చింది. ఉమ్ములో ఒక రకమైన ప్రోటీన్ ఉండడం వల్ల ఇది మొటిమలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version