తమన్నా చేసిన ఓదెల 2 చిత్రానికి భారీ షాక్

-

తమన్నా చేసిన ఓదెల 2 చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ఓదెల 2. 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సూపర్‌ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కాగా  తమన్నా చేసిన ఓదెల 2 చిత్రానికి భారీ షాక్ తగిలింది. కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని సైబరాబాద్ సీపీకి బీసీ కమిషన్ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

Tamannaah’s Odela 2 movie gets a huge shock

వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో పిచ్చగుంట కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్లు బీసీ కమిషన్ ఫైర్ అయింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి రాహుల్ గౌలీకర్.. అభ్యంతరకర పదాలు, సన్నివేశాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news