మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వేట నిషేధ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం పెంచింది. ‘మత్స్యకార సేవలో’ పేరుతో జాలర్లకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

ఇక ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు సీఎం చంద్రబాబు. కాగా చేపల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు… తల్లి రొయ్యలను సంరక్షించడం… వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం… మత్స్య సంపద పెంచేందుకు గాను… 61 రోజులపాటు వేట కు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ 61 రోజుల పాటు వేట నిషేధిస్తే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వాళ్లకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.