హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ యువకుడు అరెస్ట్

-

Pakistani man arrested for marrying Hyderabad girl: హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో మహమ్మద్ ఫయాజ్ ఉన్నాడు. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్.. భార్యను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు పోలీసులు.

Pakistani man arrested for marrying Hyderabad girl

ఈ తరుణంలోనే హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని పేర్కొన్నారు డీజీపీ జితేందర్. ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు అని ప్రకటించారు డీజీపీ జితేందర్. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు డీజీపీ జితేందర్.

 

Read more RELATED
Recommended to you

Latest news