Vijay : దళపతి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ వచ్చేది ఆరోజే

-

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి విజయ్తో జత కడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా మూవీ మేకర్స్ విజయ్ ఫ్యాన్స్ కోసం ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు.

ఈ సినిమా సెప్టెంబరు 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో విజయ్‌ కళ్లద్దాలు పెట్టుకుని నెరిసిన జుట్టు, గడ్డంతో సీరియస్‌గా చూస్తూ కనిపించాడు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మే చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version