టాంజానియా వాసి నోట.. ‘ఆదిపురుష్‌’ సినిమా పాట.. వీడియో వైరల్

-

టాంజానియా యూట్యూబర్.. సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ కిలి పాల్‌ గురించి తెలియని వారుండరు. కిలి పాల్ సోషల్ మీడియాలో చాలా పెద్ద సెన్సేషన్. సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు కిలి పాల్. టాంజానియాకు చెందిన ఈయన భారతీయ సినిమాల్లోని పాటలను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేయడంతో మంచి గుర్తింపు పొందాడు.

తాజాగా కిలి పాల్ ఆదిపురుష్ మూవీలోని ‘రామ్‌ సియా రామ్‌’(హిందీ) వెర్షన్​ను వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంబంధిత వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఆదిపురుష్‌, అందులోని ‘రామ్ సియా రామ్’ పాట దైవత్వం.. హద్దులన్నీ చేరిపేసి ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను ఏకం చేస్తోంది అని పేర్కొంది.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సినిమానే ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ రూపొందించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌, రావణాసురుడు/లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version