ఘనంగా ఆర్జీవి బామ్మర్ది రెండో పెళ్లి.. అతిథులు వీళ్ళే..!

-

ఆర్జీవి బామ్మర్ది ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగా ట్రైనర్ ఐరా త్రివేది ని రెండవ వివాహం చేసుకున్నారు. రెండో వివాహం అయినా.. ఈ పెళ్లిని ముంబైలో చాలా ఘనంగా జరిపించడం గమనార్హం. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు విచ్చేశారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరై జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే మధు మంతెన హిందీలో అమీర్ ఖాన్ గజినీ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత క్వీన్, లూటేరా, ఉడ్తా పంజాబ్ , సూపర్ 30 లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలను మధు నిర్మించారు.

ఇకపోతే ఆర్జీవి తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాని కూడా ఆయన తెలుగులో నిర్మించాడు. ఇక ఆర్జీవి మేనమామ మురళి రాజు తనయుడే మధు మంతెన. ఇటీవలే మురళీ రాజు కొన్ని నెలల క్రితం మరణించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మధు మంతెన రెండో వివాహం చేసుకున్నారు. గతంలో నందన సేన్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన ఈయన అనంతరం బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మసభా గుప్తాను 2015లో వివాహం చేసుకొని 2019లో ఆమెకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ యోగ ట్రైనర్ ఐరా త్రివేదిని ఆదివారం జూన్ 11న వివాహం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంతమంది నేరుగా హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా ఈ ఫోటోలను ఐరా త్రివేది తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకోగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version