వాడొక ఉమనైజర్.. స్టార్ డైరెక్టర్ పై సంచలన కామెంట్లు చేసిన తారక్ హీరోయిన్..!

-

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే.. మరి కొంతమంది చిక్కుకుంటున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తూ.. ఒకవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా.. అవకాశాలు లేని హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వివాదాలకు దారి తీస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఒక హీరోయిన్ ఇప్పుడు వివాదాలకు దారి తీసే పోస్ట్ పెడుతూ అందరికీ షాక్ ఇస్తోంది.

ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్.. హీరోయిన్గా సక్సెస్ పొందలేక ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది గతంలో హీరోయిన్గా నటించిన సరే ఫలితం లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాలని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత చేసేదేం లేక సీరియల్స్ వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక హిందీలో సీరియల్స్ చేసే సమయంలోనే మళ్ళీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ ఆమె బ్యాడ్ లక్ కొద్దీ ఆమె ఏం చేసినా సినిమాలలో మాత్రం క్లిక్ ఇవ్వలేకపోయింది.

ఇకపోతే సినిమాలలో అవకాశాలు లేక సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ . దానితో ఈమెను పట్టించుకోవడం మానేశారు. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లైంగికంగా తనను వేధిస్తున్నాడని కేసు పెట్టిందో అప్పటినుంచి మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చేసిన మరొక కొత్త ట్వీట్ పలు సంచలనాలకు దారితీస్తోంది. పాయల్ తన ట్వీట్ ద్వారా.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇద్దరూ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో పని చేశాను. ఎన్టీఆర్ తో పని చేశాను. వాళ్ళందరూ జెంటిల్మెన్స్. ఏ రోజు కూడా నాతో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కలిసిన మూడో మీటింగ్ లోనే నన్ను రేప్ చేశాడు.. ఇప్పుడు చెప్పండి సౌత్ ఇండస్ట్రీ ని నేను ఎందుకు పొగడ కూడదు.. అంటూ అడిగింది.. మొత్తానికైతే ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version