Taraka Rama Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చి సక్సెస్ అయ్యారు. అన్నగారు నందమూరి తారక రామారావు నుంచి.. జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కొత్త హీరోలు కూడా ఆ కుటుంబం నుంచి వస్తున్నారు. త్వరలోనే నందమూరి బాలయ్య కొడుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లోనే మరో హీరో వచ్చేశాడు.

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీనటులను అభినందించారు.