టాలీవుడ్ హీరోయిన్, బిజెపి నేత మాధవీలత కు బిగ్ షాక్ తగిలింది. టాలీవుడ్ హీరోయిన్, బిజెపి నేత మాధవీలత పై కేసు నమోదు అయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు సినీనటి, బిజెపి నేత మాధవి లత. ఈ తరుణంలోనే… సినీనటి, బిజెపి నేత మాధవి లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టిడిపి కౌన్సిలర్లు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ.
డిసెంబర్ 31 న తాడిపత్రి జేసీ పార్కులో ఓన్లీ ఫర్ ఉమెన్ తో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే… జేసి పార్కు సమీపంలో పెన్నానదిలో కొంతమంది గంజాయి, మద్యం సేవిస్తూ ఉంటారని వేడుకలకు వెళ్ళవద్దని మహిళలకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాధవీలత. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలకు జెసి ప్రభాకర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా సినీనటి, బిజెపి నేత మాధవి లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టిడిపి కౌన్సిలర్లు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ. ఇక దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.