TDP MP Byreddy Sabari who tweeted against Allu Arjun: అల్లు అర్జున్ గతంలో నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప2 సినిమాకు లింక్ చేస్తూ టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అభిమానులు విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో ఆమె కొద్దిసేపటికే పోస్టును డిలీట్ చేశారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా, నాలుగు రోజుల్లో అభిమానుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా ను పీలింగ్స్ అంటూ మరో కొత్త సాంగ్ బయటకు వచ్చింది. ఇక అల్లు అర్జున్ కొన్ని రోజుల కింద కేరళలో జరిగిన ఈవెంట్ లో చెప్పిన విధంగా ఈ పాటను తన మలయాళీ ఫ్యాన్స్ కోసం అంకితం చేస్తున్నట్లు.. పాట పల్లవి మొత్తం మలయాళం లోనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా పుష్ప 2 సినిమా విడుదల అయిన ప్రతి భాషలో ఈ లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయి అని బన్నీ అప్పుడే చెప్పేసాడు.