తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వచ్చివుండే అవసరం లేకుండా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 67496 మంది భక్తులు దర్శించుకోనున్నారు. 19064 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.
అటు నిన్న ఒక్క రోజే తిరుమల హుండి ఆదాయం 3.33 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు స్థానికులకు రేపు తిరుమల శ్రీవారి దర్శనం ఉంటుందని TTD చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. రేపటి దర్శనానికి టోకెన్స్ జారి చేసింది టిటిడి. ఈ టోకెన్లు జారిని మహతి ఆడిటోరియం వద్ధ ప్రారంభించారు TTD చైర్మన్ బీఆర్ నాయుడు.
ఈ సందర్భంగా TTD చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ… గత నెల 18వతేది స్థానికులకు శ్రీవారి దర్శనం పునరద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నామని… టిటిడి నిర్ణయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు కు వివరించానని తెలిపారు. సిఎం సూచనల మేరకు తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించామని.. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలపాలని వివరించారు.