మెగాస్టార్ చిరంజీవి పై సంచలన కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి.!

-

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని  బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. అలాగే దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను నడిపించే పెద్ద దిక్కుగా వున్నారు.

రాజకీయాలలో వెళ్ళక ముందు వరకు తన సినీ జీవితం సూపర్ గా సాగింది. ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో అప్పటినుండి తన చరిష్మా కోల్పోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తొందరగానే గ్రహించి మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. మళ్లీ ఖైదీ నంబర్ 150 తో తన సత్తా చాటాడు.ప్రస్తుతం చిరు వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ, ఇంకో రెండు సంవత్సరాల వరకు డోకా లేకుండా చూసుకున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల లో వాల్తేరు వీరయ్య లో చిరుకు సపోర్ట్ కోసం రవితేజ ను తీసుకున్నారు. అంతకు ముందు గాడ్ ఫాదర్ లో సాల్మన్ ఖాన్ ను, ఆచార్యా లో రామ్ చరణ్ ను పెట్టారు. ఇది మార్కెట్ కోసమా పాడింగ్ కోసమా అనేది అర్దం కావడం లేదు.దీనిపై తమ్మారెడ్డి భరద్వాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరుకు తోకలు.. ఆయన్ని ఎత్తడానికి జాకులు అవసరం లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు.చిరు మార్కెట్ ఎక్కడికీ పోలేదని.. ఆయన మార్కెట్ ఆయనదేనని.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఆయనే నెంబర్ 1 అని కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version