కొన్ని దుష్టశక్తుల వల్ల వైసీపీకి దూరమయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. తాజాగా జనసేన పార్టీలో చేరారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడారు. పదవులు ఆశించి జనసేనలో చేరలేదని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ ఉన్నన్నాళ్ళు పిఠాపురం కు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేందుకు నా వంతు పని చేస్తానని ప్రకటించారు. కొన్ని దుష్టశక్తుల వల్ల వైసీపీకి దూరమయ్యానని వెల్లడించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని తెలిపారు. పొత్తు ధర్మం ప్రకారం కలిసి పని చేస్తానని ప్రకటించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పిఠాపురం అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు, పార్టీపరంగా ఏ బాధ్యత అప్పగించిన నిర్వర్తిస్తానన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.