బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకునే అర్హత నాకన్నా ఆ హీరోకే ఉంది.. రన్బీర్ కపూర్

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర ది పార్ట్ వన్. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రన్బీర్ నటనకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రన్బీర్ కపూర్ ఈ విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జాతీయస్థాయిలో అవార్డును అందుకోవటం ఆనందంగానే ఉంది కానీ ఎందుకు నేను అర్హుడ్నే కాదు అంటూ చెప్పుకొచ్చారు..

స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘తూ ఝూఠీ మై మక్కర్’.. ఈ సినిమా హోలి కానుకగా మార్చి 8న విడుదల కానుంది. లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న ఈ హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకోవడం ఎలా ఉంది అంటూ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు..

“ఈ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉంది. కానీ, ఈ పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు లేదు. నేను ‘బ్రహ్మాస్త్ర’ లో అద్భుతంగా ఏమీ నటించలేదు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో చాలామంది తన నటనతో నన్ను ఆకట్టుకున్నారు ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన నన్ను మెస్మరైజ్ చేసింది గంగుబాయి కతిగావాడాలో అలియా భట్ ఆర్ఆర్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి ఈ సినిమాల్లో వీరు నటన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.. అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version