అదీ పవన్ కళ్యాణ్ అంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్..!

-

సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా బ్రో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా ఘనంగా నిర్వహించారు. జూలై 28వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్లు అప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బుకింగ్ మొదలైన గంటలోనే అన్ని టికెట్లు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఏకంగా 10 వేలకు పైగా టికెట్లు బుక్ అవడం పవన్ కళ్యాణ్ రేంజ్ ను మరొకసారి నిరూపిస్తోందని చెప్పవచ్చు. మామ అల్లుళ్లు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో సినిమాపై ముందు నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

పైగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతోంది. అంతే కాదు ఈ సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు , బెనిఫిట్ షోలు కూడా ఉండవని నిర్మాతలు ప్రకటించారు. అందుకే రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇకపోతే బుకింగ్ చేసిన గంటలోపే ఇలా పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం అంటే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని చెప్పవచ్చు. అంతే కాదు ఇదొక రికార్డు అని సినీ పండితులు కూడా చెబుతున్నారు. సినిమా విడుదల అయితే కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుందని కూడా చెబుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమాను తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా ఒరిజినల్ సినిమాకు కొన్ని మార్పులు చేసి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు త్రివిక్రమ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ తో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వప్రసాద్ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా ప్రియా ప్రకాష్ వారియర్, కేతికాశర్మ నటిస్తున్నారు. ఈ సినిమా మరో రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news