గేమ్ ఛేంజర్ సినిమా అసలు రన్ టైం 5 గంటలు అని సమాచారం అందుతోంది. దీనిపై పోస్టులు కూడా బయటకు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా దర్శకుడు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా నాకే నచ్చలేదని… బాంబ్ పేల్చారు శంకర్. రామ్ చరణ్‌తో కలిసి రూపొందించిన తన ప్రాజెక్టుపై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చిన తరుణంలో…. గేమ్ ఛేంజర్ సినిమా దర్శకుడు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గేమ్ ఛేంజర్ ఔట్‌పుట్‌తో నేను పూర్తిగా సంతృప్తి చెందలేదన్నారు. మొత్తం సినిమా ఐదు గంటల రన్‌టైం వస్తే, అందులో చాలా సీన్లు తొలగించామని తెలిపారు. నాలాంటి డైరెక్టర్ ఇలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వడని వెల్లడించారు. కానీ, గేమ్ ఛేంజర్ విషయంలో నేను రాజీ పడాల్సి వచ్చిందన్నారు. నేను ఈ చిత్రాన్ని ఇంకా బాగా తీసేవాడినంటూ కుండబద్దలు కొట్టాడు శంకర్. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా దర్శకుడు శంకర్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.