ఫోటోలో ఉన్న బాయ్ ఫ్రెండ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!

-

తెలుగు అమ్మాయిగా ఎంతో అందంతోపాటు నటన నైపుణ్యం కలిగి ఉన్నటువంటి హీరోయిన్లలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. మొదటగా ఈమె నటించిన టాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాతో మరింత క్రేజ్ను సంపాదించుకుంది. అయితే గత కొంత కాలంగా ఈమె ఒక క్రికెట్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమే వివాహం చేసుకోబోతోంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.అయితే ఇటీవల ప్రియాంక తన క్యూట్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే ఆ ఫోటోలను వెంకటేష్ అయ్యర్ కూడా చాలా క్యూట్ గా ఉన్నావ్ అని కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇలా వీరిద్దరి గురించి పలు రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కానీ మొన్నటి రోజున ప్రియాంక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది ఈమె ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో మాట్లాడుకున్నట్టు అంటే ఈ ఫోటోని షేర్ చేయడంతో.. ఈ ఫోటోలో ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ అంటూ పలు రకాలుగా కామెంట్ చేశారు.అయితే ఈ వార్తలపై స్పందించిన ప్రియాంక తన గురించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతూ.. తను బాయ్ ఫ్రెండ్ కాదు.. అంటూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి బాయ్ ఫ్రెండ్ అంటూ వచ్చిన వార్తలపై తన తల్లి తనని అడుగుతోందని తెలియజేసింది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి.. వీరికి ఫొటోస్ సెషన్ లో సహాయం చేయడం కోసం వచ్చిన వారిని తెలియజేసింది ఇలా ఆమె తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో కాస్త నిరుత్సాహ చెందారు ఆమె అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version