బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ని వదులుకున్న హీరోయిన్స్.. కారణం..?

-

నటసింహం బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు . ఇకపోతే బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత నటించిన చిత్రం బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహా రెడ్డి. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులను మొత్తం తిరగరాసింది. బాలయ్య సరసన సిమ్రాన్, అంజలా జవేరి నటించడం.. మణిశర్మ సంగీతం అందించి తన పాటలతో ఉర్రూతలూగించారు. జనవరి 13 , 1999 న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అభిమానులకే కాదు ప్రజలకు కూడా మంచి సంక్రాంతి పండుగ విందు తినిపించింది.

మొత్తంగా ఆరు కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా 16 కోట్ల రూపాయలను రాబట్టి 122 కేంద్రాలలో 50 రోజులు , 32 కేంద్రాలలో 100 రోజులు, 29 కేంద్రాలలో 175 రోజులు అలాగే 3 థియేటర్లలో 227 రోజులు ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ దర్శకుడిగా ఈ సినిమాకు బి. గోపాల్ కి ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే ఇంతటి బ్లాక్బస్టర్ సినిమా ను ప్రముఖ హీరోయిన్లు వదులుకోవడం ఆ తర్వాత బాధ పడటం కూడా జరిగింది.

ఇకపోతే బాలయ్య సినిమాకి నో చెప్పిన వారు ఎవరంటే ముందుగా రాశి , సంఘవి , అంజలా జవేరి లను హీరోయిన్ లుగా అనుకున్నారు. రాశి సీతాకోకచిలుక సన్నివేశానికి నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ సెలెక్ట్ అయింది . ఇక సంఘవి కూడా వేరే సినిమా షూటింగులతో బిజీగా ఉండడం వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా వచ్చి 23 సంవత్సరాలు అవుతున్న బాలయ్య, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఏది ఏమైనా రాశి , సంఘవి వంటివారు ఇంతటి మంచి సినిమా వదులుకొని బాధపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version