నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే… నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లారు ఐటీ అధికారులు. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన ఐటీ అధికారులు.. వివరాలు చూస్తున్నారు.
ఇక ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజ్ భార్య తేజస్విని స్పందించారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ భార్య తేజస్విని మాట్లాడుతూ…. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటి వాళ్ళు తీసుకెళ్లారన్నారు. ఉదయం నుంచి ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని వెల్లడించారు.
సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నారన్నారు. ఐటీ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు మాత్రమేనని వివరించారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారని తెలిపారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని వివరించారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు
బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన ఐటీ అధికారులు https://t.co/o2XdkLV3MF pic.twitter.com/kSFgi6P9B2
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025