కలర్ ఫోటో మూవీ దర్శకుడు ఓ ఇంటి వాడయ్యాడు. చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఆయన ఓ నటిని వివాహం ఆడాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొద్ది మంది బంధువుల నడుమ వీరి వివాహం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. కలర్ ఫోటో మూవీ దర్శకుడు సందీప్ రాజు హీరోయిన్ చాందినీ రావు మెడలో బంధువుల సమక్షంలో మూడు ముళ్లు వేశాడు.
శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. దర్శకుడు సందీప్ రాజు వివాహానికి కలర్ ఫోటో ఫేం హీరో సుహాస్ అండ్ ఫ్యామిలీ కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరిద్దరి వివాహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, సినిమా చిత్రీకరణలో భాగంగా వీరిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు టాక్.
హీరోయిన్‌తో డైరెక్టర్ పెళ్లి
👉ఘనంగా ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజు పెళ్లి
👉తిరుమలలో దర్శకుడి జరిగిన వివాహం
👉హీరోయిన్ చాందినీ మెడలో మూడుముళ్లు వేసిన దర్శకుడు pic.twitter.com/JzqiVgehK7— ChotaNews (@ChotaNewsTelugu) December 7, 2024