అల్లు అర్జున్ కు సిగ్గు శరం ఉందా..వాళ్లకు రూ.25 లక్షలే ఇస్తావా ? అంటూ జనసేన నాయకులు సింగలూరి శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుఅర్జున్ పై జనసేన నేత శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి సినిమా పారితోషికం రూ300 కోట్లు కావాలా ? ఆయన సినిమా కలెక్షన్స్ రూ 2000 కోట్ల పైనే ఉండాలా ? అంటూ నిప్పులు చెరిగారు జనసేన నాయకులు సింగలూరి శాంతి ప్రసాద్.
అల్లు అర్జున్ సినిమా కి వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తారా ? అని నిలదీశారు. అల్లు అర్జున్ కు, ఆయన నిర్మాతలకు సిగ్గు శరం ఉందా ? అంటూ ఆగ్రహించారు. వాళ్ళని అసలు మనుషులుంటారా ? మానవత్వం ఉందా ? కేసు మాఫీ కోసం ముష్టా ? అంటూ ఎక్స్ లో జనసేన నేత సింగలూరి శాంతి ప్రసాద్ వ్యాఖ్యానించారు. కాగా… సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిలాటలో మరణించిన రేవతికి రూ. 25 లక్షలు ప్రకటించారు అల్లు అర్జున్.