సలార్ సినిమాకు తప్పని లీకల బెడద.. ఫొటోస్ వైరల్..!!

-

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ నటించిన ప్రస్తుత చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కాబోతున్నాయి. ప్రభాస్ నటించిన ప్రస్తుత చిత్రాలలో సలార్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాట ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కూడా బొగ్గు గనుల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

సలార్ సినిమా ఇప్పటికే 85% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సలార్ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి కూడా లేకుల బెరడుగా తప్పడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తాజా వైరల్ గా అవుతున్న లీక్ ఫోటోలలో ప్రభాస్ చాలా హైలైట్ గా కనిపిస్తున్నారు.

దీంతో చిత్ర బృందం మరొకసారి అప్రమత్తం అయ్యేలా కనిపిస్తోంది. షూటింగ్ ఫోటోలు వీడియోలు లీక్ అవ్వడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది. అభిమానులు మాత్రం ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు చిత్ర బృందం ఏదైనా అప్డేట్ విడుదల చేస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version