ప్రముఖ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకి దగ్గరవుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన అందాల విందుతో అంతర్జాతీయ మీడియాని ఆకట్టుకునే ప్రయత్నంలో పడింది. కాన్స్ 2023లో ఊర్వశీ రౌటెలా ధరించిన నగలు, దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఆమె ధరించిన జువెలరీ విలువ తెలిస్తే మాత్రం ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంతోషంగా జీవించవచ్చు.
ముఖ్యంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పొరేట్ పై సినీ తారలు విచిత్ర వేషధారణలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం విలువైన నగలు, ఖరీదైన దుస్తుల ధరించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే ఎవరికి ఊహకి కూడా అందకుండా తనదైన శైలిలో వస్త్రాభరణాలతో తళుక్కుమని మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఈమె ధరించిన కార్టియర్ క్రొకోడైల్ జ్యువెలరీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జ్యువెలరీ నీ సైమా కోట్యూర్ వారు డిజైన్ చేయడం గమనార్హం.
ఇకపోతే ఈ జువెలరీ విలువ అక్షరాల రూ.275 కోట్లు.. అంత ఖరీదైన నగలతో ఊర్వశి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది .ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఊర్వశి తెలుగు, తమిళ్ ,హిందీ చిత్రాలతో తనదైన శైలిలో వెండితెరపై రాణిస్తోంది. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇక త్వరలోనే పర్వీన్ బాబి బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది.